Sunday, September 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి`

‘అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి`

- Advertisement -

జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ, మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి నిర్మిస్తున్న వినూత్న ప్రేమకధా చిత్రం ‘అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి`.
శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర టీజర్ రిలీజ్ వేడుక ప్రసాద్ ల్యాబ్లో వైభవంగా జరిగింది. ఎపి.ఎఫ్.డి.సి.చైర్మన్ భరత్ భూషణ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్, ఫిలిం చాంబర్ ప్రధాన కార్యదర్శి కే అశోక్ కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు విఎన్ ఆదిత్య, సీనియర్ ఫిలిం జర్నలిస్టులు ప్రభు, సురేష్ కొండేటి, నిర్మాత టి. రామసత్యనారాయణ ఈ వేడుకలో పాల్గొన్నారు. శైలజా రెడ్డి సినిమా నిర్మాణ రంగంలోనూ అసాధారణ విజయం సాధించడం ఖాయమని, హీరోగా పరిచయమవుతున్న పవన్ మహావీర్ ను చూస్తుంటే… ఇది అతని తొలి చిత్రం అనిపించలేదని, అతనిలో అంత ఈజ్ ఉందని అతిథులు కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -