Thursday, June 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమనసును హత్తుకునే అందమైన ప్రేమకథ

మనసును హత్తుకునే అందమైన ప్రేమకథ

- Advertisement -

హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, హీరో విశ్వక్ సేన్, ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని అతిథులుగా పాల్గొన్నారు. నిర్మాత వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ ,'అరవింద్ తో పరిచయం అయ్యాక ఆయనకు ప్రతి రోజూ ఏదో విషయంలో థ్యాంక్స్ చెబుతూనే ఉన్నాను. విశ్వక్ తన వారు అనుకుంటే ఎలాంటి సందర్భంలోనైనా మనకోసం నిలబడతారు. ఆయన డైరెక్షన్, ప్రొడక్షన్, యాక్టింగ్..ఇలా వెర్సటైల్ టాలెంట్ చూపిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఈ సినిమాకు చాలా విషయాల్లో సజెషన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో వన్ సైడ్ లవ్ చూపిస్తున్నాం. ఇది ఒక బ్యూటిఫుల్ ఫిలిం. ఇన్ సైడ్ ఎమోషన్స్ మీరు ట్రైలర్ లో చూశారు. ఔట్ సైడ్ దీవాన ఏంటంటే శ్రీకాంత్ డైరెక్టర్ కావాలనే ఇరవై ఏళ్ల కలను దీవాన నిజం చేసింది. మా టీమ్ లోని ఎంతోమంది సినిమా కలను నిజం చేసిందీ సినిమా. ఈ సినిమా ఇంటర్వెల్ టైమ్ కే ఆ ఫీల్ లో ఉండిపోతారు. సినిమా పూర్తయ్యేసరికి ఒక ఎమోషన్ కు గురవుతారు అని అన్నారు.

‘ఈ చిత్రానికి మా డైరెక్టర్ శ్రీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్, హీరోయిన్ స్మేహ, హీరో హర్షిత్ నాలుగు ఫిల్లర్స్. ఈ ఫిల్లర్స్ కు పునాదిలా నిలబడ్డారు మా ప్రొడ్యూసర్ వాసుదేవ్. మా సినిమా ఏ జోనర్ అంటే గుండెల్ని పిండేసే జోనర్ అని చెబుతానుఅని చెప్పారు. డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ,'ఈ సినిమాలో అమ్మాయి, అబ్బాయి, వన్ సైడ్ లవ్ తో పాటు ఈక్వల్ గా పేరెంట్స్ లవ్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ లవ్ ఉంటుంది. ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ సినిమా మీ టైమ్ కు, మీ సెన్స్ కు, మీ టేస్ట్ కు రెస్పెక్ట్ ఇస్తుంది. సినిమాలు చూడాలనే లవ్ ను మళ్లీ పుట్టించే సినిమా ఇది అని తెలిపారు. ‘ సినిమా బాగున్నప్పుడే టీమ్ మొత్తం కాన్ఫిడెంట్ గా ఉంటారు. అలాంటి కాన్ఫిడెన్స్ ఈ మూవీ టీమ్ లో కనిపిస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలిఅని హీరో విశ్వక్ సేన్ చెప్పారు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ,'ఈ కథ విన్నాక సినిమా చేయండని చెప్పాను. కొంత ఎక్కువ ఖర్చైనా బాగా కష్టపడి మంచి సినిమా చేశారు. ఈ సినిమా సున్నితంగా ప్రారంభమై మన హృదయాల్లోకి చొచ్చుకెళ్లే ప్రేమ కథ. డీసెంట్ గా ఉంటుంది. ఇందులో హీరో హర్షిత్ ఎంతో బాగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో మనల్ని ఏడిపిస్తాడు. దర్శకుడు శ్రీకాంత్ ఈ కథ చెప్పిన వెంటనే ఎప్పుడు తీద్దామని అడిగాను. ఎంత బాగా చెప్పాడో అంతకంటే బాగా తీశాడు అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -