Friday, June 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంద్రవ్యోల్బణం అంటే ఇష్టం : ట్రంప్‌

ద్రవ్యోల్బణం అంటే ఇష్టం : ట్రంప్‌

- Advertisement -

వాషింగ్టన్‌ : వినియోగ ధరల పెరుగుదలపై వ్యక్తమవుతున్న ఆందోళ నలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తేలికగా తీసుకున్నారు. గత సంవత్సరం మే నెలలో నమోదైన ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఈ ఏడాది మేలో 4.2 శాతం పెరుగుదల కన్పి స్తోందని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023 తర్వాత ద్రవ్యోల్బణం ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి. దీనిపై ట్రంప్‌ మాట్లాడుతూ తాను ద్రవ్యోల్బణాన్ని ఇష్టపడతానని చెప్పా రు. ఇరాన్‌ నుంచి రహస్యంగా లక్షలాది బ్యారల్స్‌ చమురును తొలగిస్తున్నామని తెలిపారు. దీంతో గ్యాస్‌ ధరలు అదుపులో ఉంటాయని అన్నారు. యుద్ధం ముగిసిపోతే ద్రవ్యోల్బణం దానంతట అదే తగ్గుతుందని భరోసా ఇచ్చారు. ‘నేను ద్రవ్యోల్బణాన్ని ఇష్టపడతాను. అంకెలు చాలా గొప్పగా ఉంటాయి. నేను నిజంగా దేనిని ఇష్టపడతానో మీకు తెలుసా? నేను ద్రవ్యోల్బణాన్ని ఇష్టపడతాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే యుద్ధం ముగిసిన వెంటనే…మీకు తెలుసు. నేను ఇప్పుడే చెప్పగలను. అది మీకు తెలియదు…ద్రవ్యోల్బణం తగ్గిపోతుంది’ అని చెప్పుకొచ్చారు. ‘మనం లక్షల బ్యారల్స్‌ చమురును హార్ముజ్‌ మీదుగా రహస్యంగా తరలిస్తున్నామన్న విషయం మీకు తెలుసా? ఎవరికీ తెలియదు. ఎవరికి తెలియదో తెలుసా? ఇప్పటి వరకూ ఇరాన్‌కే తెలియదు’ అని ట్రంప్‌ అన్నారు. మేలో తాను ఇచ్చిన ఆదేశాల మేరకు రహస్య మిషన్‌ ద్వారా వంద మిలియన్‌ బ్యారల్స్‌కు పైగా చమురును హార్ముజ్‌ మీదుగా రవాణా చేయడంలో అమెరికా సైన్యం సాయపడిందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -