నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్ని కల్లో తన నామినేషన్ తిరస్కర ణపై కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై తక్షణమే విచారణ చేపట్టాలని మీనాక్షి గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. మీనాక్షి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. తప్పుడు రీతిలో మీనాక్షి నామినేషన్‌ను తిరస్కరించినట్టు ఆయన ధర్మాసనానికి తెలిపారు. ఎన్నికల ఫలితాల ప్రకటనపై తాత్కాలిక నిలుపుదల (స్టే) ఇవ్వాలని కోరారు. అయితే ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు అంగీకరించిన ధర్మాసనం, నేడు (శుక్రవారం) విచారించనుంది. కాగా మధ్యప్రదేశ్ లో మొత్తం మూడు రాజ్యసభ స్థానాలను అధికార బీజేపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో… బీజేపీ అభ్యర్థులు రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేష్ కేవత్ లు విజేతలుగా అధికారికంగా ఎన్నికయ్యారు.
సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్
- Advertisement -
- Advertisement -



