బీజేపీ అధ్యక్షులు రాంచందర్రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై తమ పార్టీని ఓడించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్రావు చెప్పారు. అయినప్పటికీ తాము ఆశించిన ఫలితా లే సాధించామని అన్నారు. దాదాపు 250 కౌన్సి లర్స్, 50 మంది కార్పొరేటర్లను తమ పార్టీ గెలి చిందని చెప్పారు. శుక్రవారం హైదరబాద్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, ఇతర నాయకులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించి బలపడ్డా మన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆరు మున్సి పాల్టీల్లో గెలిచామన్నారు. కరీంనగర్, నిజామా బాద్ కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతున్నట్టు వివరించారు. నారాయణపేట, ఆదిలాబాద్, రాయికల్, మెట్పల్లిలో తమ పార్టీ అభ్యర్థులే చైర్మెన్ పదవులు పొందుతారని గుర్తు చేశారు. ఎక్స్ అఫిషియో, స్వతంత్రుల మద్దతుతో పలు పదవులను దక్కించుకుంటామన్నారు. కొన్ని జిల్లాల్లో ఫలితాలు ఆశాజనకంగా రాలేదని తెలిపారు. త్రిముఖ పోరులో తమ పార్టీకి కొంత నష్టం జరిగిందన్నారు. తమకు ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఒక డివిజన్, అశ్వారావుపేటలో ఒక వార్డు గెలిచామ న్నారు. కాంగ్రెస్కు అనుకున్న ఫలితాలు రాలేద న్నారు. బీఆర్ఎస్ పైనుంచి కిందికి పడిపోయిం దనీ, బీజేపీ కింది నుంచి పైకి లేచిందని వివరిం చారు. ఈ ఎన్నికల్లో 13 శాతం నుంచి 25 శాతానికి ఓట్లు పెరిగాయని తెలిపారు. హంగ్ వచ్చిన చోట బీజేపీ ఎవ్వరికీ మద్దతు ఇవ్వబోదని స్పష్టం చేశారు. కానీ తమకు ఎవరైనా మద్దతు ఇస్తామంటే తీసుకుంటామన్నారు. తమ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలకు, కష్టపడి పని చేసిన నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై ఓడించాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



