– కాంగ్రెస్‌కు కమలం ప్రత్యామ్నాయం కలేనా?
– కలిసిరాని జాతీయ నేతల ప్రచారం
– ఆపార్టీ మ్యానిఫెస్టోను విశ్వసించని ఓటర్లు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి నుంచి కోలుకోక ముందే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఆ పార్టీకి మరోసారి షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో తొలిసారి అన్ని వార్డులు, డివిజన్లలో పోటీ చేసిన ఆ పార్టీకి నిరాశే మిగి లింది. పట్టణ ప్రాంతాల్లో కమలం పార్టీ బలంగా ఉంటుం దనే ప్రచారం ఈ ఫలితాలతో తేలిపోయింది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ స్థానాన్ని ఆక్రమించి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నా యంగా ఎదగాలనే కమలనాథుల ఆశలు గల్లంత య్యాయి. అత్యధిక మున్సిపాల్టీలను గెలుచు కుంటామనే బీజేపీ నేతల ఆర్భాటపు మాటలను ఈ ఫలితాలు తలకిందులు చేశాయి. గత మున్సిపల్ ఎన్నికల కంటే వార్డులు, కార్పొరేషన్లు నామమాత్రంగా పెరిగాయి. ఓట్ల శాతం పెరిగినా ఆ పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ ప్రచారం కోసం జాతీయ నేతలను రంగంలోకి దించింది. ఏకంగా బీజేపీ నూతన అధ్యక్షులు నితిన్ నబిన్ కూడా వచ్చి మహబూబ్‌నగర్‌లో నిర్వహిం చిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సహా అనేక మంది జాతీయ నాయకులు వచ్చి ప్రచారం చేసినా స్థానిక ప్రజలు ఆపార్టీని ఆదరించలేదు. జాతీయ, రాష్ట్రస్థాయిలో రాజకీయ విమర్శలే తప్ప స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించలేదు. పట్టణ ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేసేందుకే పరిమిత మయ్యారు. సీనియర్ నేతల మధ్య సమన్వయం లోపిం చడం కూడా ఆ పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థుల కంటే స్వతంత్రులే బలంగా నిలిచిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీలో అంతర్గతంగా చర్చనీయాంశ మవుతున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు శాతం పెరిగినా, అదే ఊపు స్థానిక ఎన్నికల్లో కనిపించ లేదు.
‘మున్సిపల్’లో బీజేపీ బోల్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



