నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ రవాణాకు కస్టమ్స్ అధికారులు చెక్ పెట్టారు. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి సుమారు 3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని ఈరోజు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే, ఇవాళ ఉదయం థాయ్ ఎయిర్వేస్ విమానంలో బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అందులో దాచి ఉంచిన డ్రగ్స్ బయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్నది సాధారణ గంజాయి కాదని, అధిక మత్తునిచ్చే హైడ్రోపోనిక్ గంజాయి అని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి భారీ ధర ఉంటుందని చెప్పారు. పట్టుబడిన మహిళను అరెస్ట్ చేసి, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఆమె కేవలం కొరియరా? లేక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



