Friday, April 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకిడ్నీ వ్యాధి బాధితులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

కిడ్నీ వ్యాధి బాధితులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే ప్రస్తుతం ఉన్న డయాలసిస్ కేంద్రాల్లో పడకల సంఖ్యను పెంచనుంది.మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల నుంచి కిడ్నీ రోగులు డయాలసిస్ కోసం సూదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రతి 25 కిలోమీటర్ల దూరానికి ఒక కేంద్రం ఉండేలా ప్లాన్ చేస్తోంది. కొత్త డయాలసిస్ కేంద్రాలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త డయాలసిస్ సెంటర్లను ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో పద్ధతిలో ‘హబ్‌ అండ్‌ స్పోక్‌’ మోడల్‌లో నిర్వహించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -