Friday, June 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతాం

రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతాం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో తెలంగాణ రక్షణ సేన సత్తా చాటుతుందని ఆ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు పేర్కొన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం టీఆర్ఎస్ జండాను మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సమీపంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కామారెడ్డి జిల్లా జిల్లా ఆఫజ్వావార్, కోలా శ్రీనివాస్,  రాష్ట్ర నాయకురాలు వరలక్ష్మి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్, కామారెడ్డి జిల్లా యూత్  ప్రెసిడెంట్ సురేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ సాయిలు మిర్రెవర్, జుక్కల్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజశేఖర్, సంజీవ్ బొరిగి, మద్నూర్ మండల అధ్యక్షులు మారుతి, హనుమాన్లు బండివార్, తదితరులు పాల్గొని మాట్లాడారు.

జుక్కల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా బలపడుతుందని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపిస్తుందని నాయకులు అన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి భాజా భజంత్రీలతో పండుగ వాతావరణంలో చేపట్టారు. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ రక్షణ సేన లక్ష్యంగా పార్టీ బలోపేతానికి స్థానిక నాయకులు పనిచేస్తారని అన్నారు. కవిత నాయకత్వంలో తెలంగాణ గడ్డపై టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -