Saturday, June 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకిరణ్ అబ్బవరం నయా సినిమా షురూ

కిరణ్ అబ్బవరం నయా సినిమా షురూ

- Advertisement -

కిరణ్ అబ్బవరం హీరోగా, కథా రచయితగా, స్క్రీన్‌ప్లే రచయితగా, దర్శకుడిగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి నిర్మిస్తుండగా, సురేష్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో దేవికా భట్ తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. సీనియర్ నటులు శరత్ కుమార్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించే ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శుక్రవారం హైదరా బాద్‌లో చిత్ర బృందం, నటీనటులు హాజరైన పూజా కార్యక్రమంతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవం అనంతరం వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. తొలి షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొంటోంది. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే కిరణ్ అబ్బవరం పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేశారు. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలతో పాటు తనలోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -