Friday, June 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయాక్షన్ కథతో 'సింగ`

యాక్షన్ కథతో ‘సింగ`

- Advertisement -

హీరో గోపీచంద్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగ’. యాక్షన్ కొరియోగ్రాఫర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమా టైటిల్‌తో పాటు ఆయన లుక్‌ను కూడా రివీల్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్లోని ట్రైబల్ నేపథ్య సంగీతం ఆసక్తిని మరింత పెంచుతుంది. ఇందులో గోపీచంద్‌ను రివీల్ చేస్తూ మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కళ్లలో ఆగ్రహం, చేతిలో గొడ్డలి, ప్రతీకారంతో రగిలిపోతున్న పాంథర్‌లా కనిపిస్తూ పవర్ ఫుల్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. తర్వాత ‘సింగ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను రివీల్ చేశారు. టైటిల్ డిజైన్ కూడా ఎంతో ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో మలయాళ నటి అనార్కలి నజర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -