నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలం మరింతగా పెరిగింది. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సమక్షంలో పలువురు స్వతంత్ర కౌన్సిలర్లు శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికలతో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పట్టు మరింత బలపడింది. వీరి చేరికతో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉంది. కామారెడ్డి మునిసిపాలిటీలో 49 వార్డులు కాగా మ్యాజిక్ ఫిగర్ 25, వీరి చేరికతో కాంగ్రెస్ కౌన్సిలర్లు 22కు చేరారు. మరో ముగ్గురు కౌన్సిలర్ అయితే కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం కైవసం చేసుకుంటారు. 40వ వార్డు లో గెలుపొందిన ఎస్. నాగమణి భాస్కర్ గౌడ్, 38వ వార్డు, ఇప్ప ఉమా రాణి శ్రీనివాస్, 3వ వార్డు షేక్ బబ్లు లు శుక్రవారం సాయంత్రం మహ్మద్ షబ్బీర్ అలీ వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ ముగ్గురు కౌన్సిలర్ల చేరికతో కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలం 22కు చేరుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ పాలనపై నమ్మకం ఉంచారని, పట్టణ అభివృద్ధి కోసం తమ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. మున్సిపాలిటీలో తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారగా, కాంగ్రెస్ పార్టీ మెజారిటీ దిశగా దూసుకెళ్తోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.



