Saturday, February 14, 2026
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేట ప్రజాప్రతినిధులుగా దళితులు

అశ్వారావుపేట ప్రజాప్రతినిధులుగా దళితులు

- Advertisement -

– అశ్వారావుపేట ప్రజాప్రతినిధులు గాదళితులు
– నాడు తాత – నేడు మనవడు
– తొలి ప్రయత్నంలోనే మహేష్ బాబు ఘనవిజయం
నవతెలంగాణ – అశ్వారావుపేట 
రాజకీయంగా రాణించాలంటే నేడున్న సామాజిక,ఆర్థిక పరిస్థితిల్లో సాధారణ పౌరులు కు కష్టతరం మే అయినా యాదృచ్ఛిక మో లేక కాకతాళీయం మో ఏదైతేనేం ఒకో సారి అదృష్టం తన్నుకుంటూ వస్తుంది.దాన్ని ఎవరైతే ఒడిసి పడతారో వారే విజేత లు అవుతారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ 11 వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైన నార్లపాటి మహేష్ బాబు తొలి ప్రయత్నంలోనే పాలకవర్గం సభ్యులు అయ్యారు. ఆయితే ఇదేదో ఆషామాషీగా అయింది ఏమీ కాదు. కాంగ్రెస్ లోనే పాత – కొత్త వర్గాల పునరేకీకరణ సమీకరణలో ఓ అగ్ర,ఆర్ధిక పరిపుష్టి సామాజిక వర్గం వ్యక్తుల అండదండలతో ఈయనకు ఈ అభ్యర్థిత్వం దక్కింది. 11 వార్డులో మొత్తం 780 ఓటర్లు ఉండగా 597 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ వార్డు అన్రిజర్వడ్ (జనరల్) కావడం తో నలుగురు పోటీ పడ్డారు.

ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి నార్లపాటి మహేష్ బాబు కు 390, బీఆర్ఎస్ అభ్యర్థి తగరం జగన్నాధం కు 184, బీజేపీ అభ్యర్థి నైనారపు రాజేష్ కు 06, ఏడీఆర్పీ అభ్యర్థి పఠాన్ రహీం పాషాకు 02 చొప్పున ఓట్లు వచ్చాయి. అయితే మహేష్ తన సమీప ప్రత్యర్థి తగరం జగన్నాధంపై 206 ఓట్లు ఆధిక్యంతో గెలుపొందారు. ఇదిలా ఉండగా ఈయన తాత నార్లపాటి పిచ్చయ్య సైతం పేరాయిగూడెం పంచాయతీ తొలి సర్పంచ్ గా సేవలు అందించిన అవినీతి మరక అంటని పాలకుడి గా గుర్తింపు తెచ్చుకున్న ఆదర్శవంతుడు. ఆయన రాజకీయ వారసత్వం మహేష్ కు మార్గదర్శకం అని చెప్పుకోవచ్చు.

మహేష్ బాబు సైతం అశ్వారావుపేట మున్సిపాలిటీ తొలి పాలకవర్గం సభ్యులు కావడం గమనార్హం. ఈ పాలకవర్గం లో పూర్వ పేరాయిగూడెం పంచాయతీ నుండి నేడు మున్సిపాలిటీ లో 11 వ వార్డు కౌన్సిలర్ నార్లపాటి మహేష్ బాబు,21వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ నార్లపాటి మౌనిక, 22 వ వార్డు కౌన్సిలర్ నార్లపాటి దివాకర్ లు ఒకే సామాజిక వర్గానికి, ఒకే ఇంటి పేరు గల సమీప, దగ్గరి బంధువులు కావడం మరో విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -