Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్30 ఏండ్ల రైతుల కల సహకారం: సర్పంచ్

30 ఏండ్ల రైతుల కల సహకారం: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూర్ :  హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం రాయకుంట చెరువుకు 30 సంవత్సరాల తర్వాత నీటి కల తీరింది. పెద్ద చెరువు నుంచి వచ్చే ప్రధాన కాలువ మూతపడి, 14 వందల ఎకరాల ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు పట్టుదలతో  చెత్తాచెదారం, చెట్లను తొలగించి కాలువను మరమ్మతు చేశారు. శుక్రవారం ఉదయం రైతులతో కలిసి పెద్ద చెరువు తూం.. వద్ద ప్రత్యేక పూజలు చేసి, తెరిచి నీటిని విడుదల చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. రాయకుంట చెరువు 30 ఏండ్లుగా నీరు రానట్టు ఉండటంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వారి ఫిర్యాదు వెంటనే చర్య తీసుకుని మరమ్మతు చేశాము. రబీ పంట సాగుకు ఇది అవకాశం. రైతుల సంక్షేమానికి ఏమైనా చేస్తాము” అన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, డిసీసీ అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి అండతో ప్రభుత్వ నిధులు తెచ్చి ఆత్మకూరు ను ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. జాతీయ రహదారిపై విద్యుత్ దీపాలు అమర్చి వెలిగించారు. “ఎవరి సమస్యలు ఉన్నా తీసుకురంటే పరిష్కరిస్తాము. గ్రామాన్ని ఆదర్శంగా మార్చుతాము” అని సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -