Saturday, February 14, 2026
E-PAPER
Homeజాతీయంముంబైలో ఘోర ప్రమాదం.. మెట్రో పిల్లర్ కూలి నలుగురు!

ముంబైలో ఘోర ప్రమాదం.. మెట్రో పిల్లర్ కూలి నలుగురు!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ముంబై సిటీలో బిజీగా ఉండే నడి రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ కలకలం రేపింది. 2026, ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం.. ముంబై సిటీ పడమర ఏరియా అయిన LBS రహదారిలో.. నిర్మాణంలో ఉన్న మెట్రో రైలు స్లాబులు కూలి రోడ్డుపై పడ్డాయి. ఇదే సమయంలో రోడ్డుపై వెళుతున్న ఆటోలు, కార్లపై పడ్డాయి.  ముంబై మెట్రో లైన్ 4 కింద ఈ పనులు జరుగుతున్నాయి. కూలి పడిన మెట్రో స్లాబులతో ఆటోలు, కార్లలో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు వెంటనే స్పందించి.. గాయపడిన వాళ్లను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఇప్పుడు వాళ్లు ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. గాయాలు తీవ్రంగా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -