– 25 వ సారి రక్తదానం చేసిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్
– ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న గడ్డమీది బాపు రావు కి ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ప్రైవేటు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ 25 వసారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐ.వి.ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు లు 200 మందికి పైగా ఉన్నారని ఆ చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉందని ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని రక్త దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని అన్నారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రక్తదాత శ్రీనివాస్ కి అభినందనలు తెలియజేసారు.



