Saturday, June 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. శనివారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో వర్షాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ‘హై అలర్ట్’ ప్రకటించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, యుద్ధ ప్రాతిపదికన వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

వర్షాలపై వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ముందస్తు ప్రణాళికతో రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా బృందాలను మోహరించి అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మున్సిపల్, పోలీస్ శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. హైడ్రా, విద్యుత్ శాఖ, వాటర్ బోర్డ్, మున్సిపల్, పోలీస్ శాఖలు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ మళ్లింపు, విద్యుత్ పునరుద్ధరణ వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎస్, డీజీపీ, క్యూర్ స్పెషల్ సీఎస్‌లు వ్యక్తిగతంగా ఈ పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -