Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వికసిత్ భారత్ కు అనూహ్య స్పందన 

వికసిత్ భారత్ కు అనూహ్య స్పందన 

- Advertisement -

నవతెలంగాణ – బీర్కూర్ (నసురుల్లాబాద్)
వికసిత్ భారత్ రన్ వే కు బీర్కూర్ మండల కేంద్రంలో అనూహ్య స్పందన లభించింది. వికసిత్ భారత్ 8కే రన్ కార్యక్రమాన్ని బీర్కూర్ మండల కేంద్రంలో వర్ని  మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రవేట్ పాఠశాల  ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ధర్మతేజ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రన్ వే వర్ని నుంచి బయలు దేరి నసురుల్లాబాద్ మండల కేంద్రం నుంచి బీర్కూరు వరకు  వికాసిత్ రన్ వే సాగింది. ఇందులో పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అనంతరం బీర్కూర్ గాంధీ కూడలి వద్ద మానవహారం నిర్వహించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ధర్మతేజ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు  దేశాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం అని అన్నారు.

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పాఠశాల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -