- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కథానాయకుడు విజయ్‌దేవరకొండ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రష్మికతో వివాహం అనంతరం సొంతూరు తుమ్మన్‌పేటలో ఇచ్చిన మాట ప్రకారం.. విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్ ప్రకటించారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను దీనికి ఎంపిక చేశారు. తాజాగా ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థుల జాబితాను ‘ది దేవరకొండ ఫౌండేషన్’ విడుదల చేసింది.
- Advertisement -



