నవతెలంగాణ – నసురుల్లాబాద్
గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఆదివారం ఉమ్మడి మండలంలో ఘనంగా నిర్వహించారు. నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గిరిజన గురుకుల పాఠశాలలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. పాఠశాల విద్యార్థులు చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. అనంతరం మండల గిరిజన నాయకులు అదే పాఠశాలలో ఘనంగా బోగ్ బండార్ వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెర్క శ్రీనివాస్ మాట్లాడుతూ చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. జంజారాల అభివృద్ధికి సేవా లాల్ చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్బంగా బీర్కూర్ మండలంలోని బీర్కూర్ తాండాలో గిరిజనులు సంప్రదాయ దుస్తులతో పాటు మంగళ హారతులతో తండాలోని ప్రధాన వీధుల గుండా పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భజా భజంత్రీలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మాధవరావు, ఉపాధ్యాయులు,మండల పరిధి గిరిజన సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



