- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఈ నెల 16 తేదీన న ఉదయం 11.00 గంటలకు భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో మంచి వాతావరణంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, కౌన్సిలర్ల కు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదివారం రోజు పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను తప్ప కుండా పాటించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు అప్రమత్తం ఉండాలని మున్సిపల్ కమీషనర్ కు అదనపు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమీషనర్ రామలింగం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



