- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తుర్కియేలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3 పోటీలో భారత్ స్వర్ణం గెలుచుకుంది. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత్‌కు చెందిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహోద్.. ప్రస్తుత ఒలింపిక్ ఛాంపియన్ అయిన దక్షిణ కొరియాను వరుస సెట్లలో ఓడించారు. దక్షిణ కొరియాకు చెందిన ఓహ్ యే-జిన్, కిమ్ జె-డివోక్‌పై 5-1 తేడాతో విజయం సాధించారు. నాలుగేళ్ల తర్వాత భారత్ వరల్డ్ కప్ స్టేజ్‌లో ఈ విభాగంలో బంగారు పతకం సాధించింది. చివరిసారిగా 2022 ఈవెంట్‌లో రిధి ఫోర్ – తరుణ్‌దీప్ రాయ్ జోడీ గోల్డ్‌ను గెలుచుకుంది.
- Advertisement -



