Sunday, June 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారీ వర్షాలకు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

భారీ వర్షాలకు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర 
మండలంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాన్వాయిగూడెం, అమర్ సింగ్ తండా, కాండ్య తండాల్లో 11 కెవీ విద్యుత్ స్తంభాలు 3, మరో ఎల్టీ విద్యుత్ స్తంభాలు 2, వడ్డెకొత్తపల్లి, చిట్యాల గ్రామాల్లో భారీ వృక్షాలు నెలకొరగడంతో విద్యుత్ తీగలు కూడా తెగిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే సంఘటనా స్థలాలకు చేరుకుని పునరుద్ధరణ పనులు చేపట్టారు. దెబ్బతిన్న స్తంభాలను తొలగించి కొత్త స్తంభాల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని ఏఈ రమేష్ బాబు తెలిపారు. తెగిపడిన విద్యుత్ తీగల వద్దకు వెళ్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -