- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో కొన్నేళ్లుగా తాగునీటి సమస్యలు మరమ్మతులకు నోచుకోక పెండింగ్లో ఉన్న పనులు ముమ్మరంగా సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇటీవల 1వ వార్డులో నీటి సమస్య పరిస్కారం కాగా ఆదివారం 3వ వార్డులోని తాగునీటి సమస్యను పరిస్కారం చేసేందుకు బోర్ మోటర్ కు మరమ్మతు పనులు చేపట్టారు. తాగునీటి సమస్యను పరిస్కారం చేయాలని వార్డు సభ్యురాలు ఇందారపు శ్యామల-శ్యాంవతోపాటు ప్రజలు అడుగగానే స్పందించిన సర్పంచ్ స్వామికి వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -


