Sunday, February 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు..

కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు..

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
మండలం కొల్లూరు గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం రోజున ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా కొల్లూరు గ్రామంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ జనగామ ఉపేందర్ రెడ్డి,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వారి సతీమణి బీర్ల ఫౌండేషన్ చైర్మన్ అనిత ని శాలువాతో సన్మానించారు. కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి దంపతులు, జనగామ నరసింహారెడ్డి,సుశీల దేవి ఫౌండేషన్ చైర్మన్,గ్రామ సర్పంచ్ జనగామ సుధారాణి శ్రీపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ గాజుల దశరథ యాదవ్, విశ్రాంత ఉపాధ్యాయులు జనగామ జయపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ పిల్లలమర్రి శంకరయ్య, గ్రామ పెద్దలు కొంతం లక్ష్మీనరసింహయ్య గౌడ్, వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండ్రోజు వెంకటేశ్వర రాజు, చిట్టోజు శ్రీనివాసచారి,చిట్టోజు బ్రహ్మచారి, శ్రీరామ్ చారి,కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడిగె పెంటయ్య గౌడ్, మాజీ ఎంపీపీ గంధమల అశోక్, మాజీ ఎంపిటిసి ఆరే ప్రశాంత్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సందుల సురేష్ గౌడ్, డప్పు కళాకారులు గ్యాదపాక రాజు, మధు తదితరులు పాల్గొన్నారు.

మహాశివరాత్రి సందర్భంగా కొల్లూరు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత పెంచింది. “హర హర మహాదేవ” నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -