Sunday, February 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కంఠాలీ సర్పంచ్

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన కంఠాలీ సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కంఠాలి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికి ఎంతో ముఖ్యమైన రోడ్డు పనులను ఘనంగా సర్పంచ్ మాత్రే నాగనాథ్ అధ్యక్షతన పంచాయతీ సెక్రెటరీ భూమేశ్వర్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..  గ్రామ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. గ్రామ అభివృద్ధి కొరకు తనవంతుగా  ప్రత్యేక చొరవ తీసుకొని రోడ్డు పనుల కోసం మొరం ఏపియించడం, గ్రామంలోని పలు వీధులలో విద్యుత్తులైట్లను వేయించానని తెలిపారు.

అదేవిధంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతను గ్రామ ప్రజలు అభినందించారు. గ్రామంలోని ప్రతి గల్లీ, ప్రతి వీధికి మెరుగైన రోడ్లు అందించడం తమ ప్రధాన లక్ష్యమని సర్పంచ్ అన్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని సర్పంచ్  నాగనాథ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్, జిపి కార్యవర్గ సభ్యులు , జిపి కార్యదర్శి , గ్రామ పెద్దలు , మురళి పటేల్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -