శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ – మాదరి ప్రశాంత్
నవతెలంగాణ- నెల్లికుదురు
మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయంపైకి వరకు విద్యుత్తును అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆ గ్రామ సర్పంచ్ మాధురి ప్రశాంత్, ఆ ఆలయ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆదివారం విద్యుత్తును పూర్తిస్థాయిలో మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. శ్రీరామగిరి గ్రామ ప్రజల ఆరాధ్య దైవం కాకతీయుల కాలం నాటి అతి పురాతన కాలంలో స్వయంబుగా వెలసిన శ్రీరామలింగేశ్వర స్వామి గెలిచారని అన్నారు. వారి కళ్యాణం మరియు మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం చుట్టుపక్క గ్రామాల నుండి మహాశివరాత్రి జాతరకు వేలాదిగా భక్తులు ఆ శివుని దర్శనo చేసుకొని మొక్కిన మొక్కులు చెల్లించుకొని నూతన కోరికలను కోరుకుంటారని వారు తెలిపారు.
శ్రీరామలింగేశ్వర కళ్యాణం మహా జాతర జరిగే చిన్నగుట్ట పైన గ్రామ ప్రజల చిరకాల కోరిక ఎన్నో ఏండ్లగా ఉన్న కరెంటు సమస్యను పరిష్కారం కోసం గౌరవ మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదేశాలతో విద్యుత్ శాఖ ఎస్ సి నరేష్ ,తొర్రూర్ డి ఈ రవికుమార్, ఏడి అశోక్ , మునిగిల వీడు సబ్ స్టేషన్ ఏఈ భార్గవి, జేఎల్ఎం శేఖర్, ఆలయాకమిటి అధ్యక్షులు గొల్లపెల్లి ప్రభాకర్ గౌడ్,గ్రామ పంచాయతీ పాలకవర్గం సహకారంతో ఈరోజు మన గ్రామ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ రామలింగేశ్వర స్వామి గుట్ట పై కరెంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చేశామన్నారు.
దీంతో గ్రామ ప్రజలు హర్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రామగిరి సుమన్,గ్రామ పెద్దలు బెల్లి నర్సయ్య,పోతారాజు శ్రీశేలం,ఆవుల వెంకన్న, సంద కృష్ణ, నర్సింగ అశోక్,డోనికాని మల్లయ్య,గుర్రాల నరేష్,చీమకుర్తి శ్రీనివాస్ పగిడిపెల్లి రాములు, దేశాబోయిన సాయిలు,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.



