- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీ పరిదిలోగల పివినగర్ అటవీప్రాంతం, మానేరు ప్రక్కనున్న పురాతనమైన నైన గుళ్లలోని మహ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరగింది. ఈ వేడుకను ఆదివారం కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ,తాడిచెర్ల మాజీ పిఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య దంపతులు, మాజీ జెడ్పిటిసి అయిత కోమల-రాజిరెడ్డి దంపతులు, ఆలయ కమిటీ, ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ ఆధ్వర్యంలో శివపార్వతుల కల్యాణం వేద పండితులచే అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి తిలకించడానికి భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల నుంచి వేలాది సందర్శకులు తరలివచ్చారు. అనంతరం సందర్శకులకు అన్నదానం నిర్వహించారు.
- Advertisement -



