Sunday, February 15, 2026
E-PAPER
Homeజిల్లాలుఛాయా సోమేశ్వరాలయానికి కేంద్రం యునెస్కో గుర్తింపు తేవాలి

ఛాయా సోమేశ్వరాలయానికి కేంద్రం యునెస్కో గుర్తింపు తేవాలి

- Advertisement -

రోడ్లు భవనాలు సినిమా ఫోటోగ్రఫీ శాఖ  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి 

11వ శతాబ్దానికి చెందిన  చారిత్రాత్మక ఛాయా సోమేశ్వరాలయానికి యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని రోడ్లు భవనాలు సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం పానగల్ లోని చారిత్రాత్మక పచ్చల,ఛాయా సోమేశ్వరాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకొని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం మహాశివరాత్రి సందర్భంగా ప్రజలు ఇచ్చిన కానుక అని మంత్రి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ, సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ మహా శివున్ని వేడుకున్నట్లు పేర్కొన్నారు. నల్లగొండ  మున్సిపల్ కార్పొరేషన్ ను గెలుచుకోవడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు.

మేయర్ ఎన్నిక తర్వాత అభివృద్ధి పనులను వేగవంతంగా చేయడం జరుగుతుందని తెలిపారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ను అభివృద్ధి చేయడంతో పాటు గ్రీన్ సిటీగా మారుస్తామని పేర్కొన్నారు. పానగల్ దేవాలయాల సమీపంలోని చందనపల్లిలో ఉన్న డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుంచి మరో చోటికి తరలిస్తామని స్పష్టం చేశారు.

మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండగోని యాదయ్య, పల్ రెడ్డి వెంకట్ రెడ్డి, గురీజాల నరేందర్, బుర్రి యాదయ్య, కొమ్మనబోయిన జానీ యాదవ్, కోడిదల ఎల్లయ్య, ఆలయ అర్చకులు ఉదయ్ కుమార్ గుండగోని శ్రీను తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -