Monday, April 20, 2026
E-PAPER
Homeక్రైమ్గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం..

గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గచ్చిబౌలిలో ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టీఎన్జీవో కాలనీలోని ఒక భవనం సెల్లార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో భవన సెల్లార్‌లో పార్క్ చేసి ఉన్న 15 ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిబూడదయ్యాయి. భవనం సెల్లార్‌లోని ఉన్న ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు మొదలయ్యాయి. మంటలు, దట్టమైన పొగ కారణంగా పైఅంతస్తుల్లో ఉన్న వారు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న 11 మందిని నిచ్చెనల సహాయంతో ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక కొందరు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా, మరొకరు పొగ పీల్చడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -