Monday, April 20, 2026
E-PAPER
Homeజాతీయంలోయలో పడ్డ బస్సు..15 మంది మృతి

లోయలో పడ్డ బస్సు..15 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జమ్మూకాశ్మీర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రామ్‌నగర్ నుంచి ఉధంపూర్‌కు వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలో పడినట్లుగా తెలుస్తోంది.

సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో రామ్‌నగర్ నుంచి ఉధంపూర్‌కు వెళ్తుండగా బస్సు లోయలో పడిపోయింది. సంఘటనా స్థలిలో 15 మంది చనిపోగా.. క్షతగాత్రులను అస్పత్రికి తరలించారు. పోలీసులు, సైన్యం సహాయ చర్యలు చేపట్టారు. అయితే కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. తాను జిల్లా అధికారులతో మాట్లాడానని.. తీవ్రంగా గాయపడిన వారిని విమానంలో తరలించే ఏర్పాట్లతో సహా సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా జితేంద్ర సింగ్ తెలిపారు. స్థానిక యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -