Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ఘన నివాళి

పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ఘన నివాళి

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి 
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సిఆర్పిఎఫ్ జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. యూనివర్సిటీ విద్యార్థులతో సి ఎస్ బిల్డింగ్ నుండి సెంట్రల్ లైట్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టేట్ యూనివర్సిటీస్ ప్రముఖ్ అశ్విని ఠాకూర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 14 ఈ భారతదేశానికి ఒక చీకటి రోజు,బ్లాక్ డే అని,ఎందుకంటే ఉగ్రవాదులకు స్థావరమైన పాకిస్తాన్,భారత జవాన్ల పైన భారత్ పైన ప్రత్యక్షంగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీసిన రోజ న్నారు.

విద్యార్థులంతా దేశ ప్రజలంతా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఐక్యమత్యంతో భారతదేశానికి, భారత సైనికులకు అండగా నిలవాలని అన్నారు. మనకోసం రాత్రనకా పగలనకా చలి అనక వాననక ప్రాణాలు లెక్క చేయకుండా దేశం కోసం సరిహద్దుల్లో కపలాకాస్తున్న ప్రతి ఒక్క సైనికుడికి పాదాభివందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. వారు చేసిన త్యాగాలని మనం మరువద్దని,వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి భారతదేశాన్ని శక్తివంతమైన దేశం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ తెలంగాణ  ఆల్ స్టేట్ యూనివర్సిటీ కన్వీనర్ బి శివ,యూనివర్సిటీ అధ్యక్షులు పృథ్వి,యూనివర్సిటీ సెక్రెటరీ సమీర్,ప్రాంత వనవాసి కన్వీనర్ అశోక్,ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్ ,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శివ,మోహన్, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు మనోజ్,జాయింట్ సెక్రెటరీ అనిల్, నాయకులు దుర్గా దాస్,రాహుల్,మహర్షి, రమణ,ప్రేమ్,శివ,సూర్య విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -