విరాట్ కర్ణ హీరోగా దర్శకుడు అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘నాగబంధం’. ఈచిత్ర టీజర్ మహా శివరాత్రి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. అగ్రకథానాయకుడు మహేష్ బాబు టీజర్‌ను లాంచ్ చేయడంతో దేశవ్యాప్తంగా అంచనాలు మరింత పెరిగాయి. ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో,’ టీజర్ అద్భుతంగా ఉంది. త్వరలో ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఎదురు చూస్తున్నాను’ అని తెలిపారు.
అహ్మద్ షా అబ్దాలి నేతృత్వంలో జరిగిన ఆఫ్ఘాన్ దాడి నుండి కొంత ప్రేరణ పొందిన ఈ కథలో మైథాలజీ, చరిత్ర, ఆధ్యాత్మిక యుద్ధం మేళవింపుగా కనిపిస్తుంది. సంస్కృతి పరిరక్షణ, దైవిక రక్షణ మధ్య సంఘర్షణ ఈ చిత్రానికి ప్రధాన బలం. విరాట్ కర్ణ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపిస్తూ టీజర్‌లో హైలైట్‌గా నిలిచారు. ముఖ్యంగా లార్డ్ శివ రూపంలో ఆయన ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, మహేష్ మంజ్రేకర్, జగపతి బాబు నటిస్తున్న ఈచిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చెడుపై పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



