కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా ‘చిరంజీవి’. కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకుడు.
ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు.
ప్రొడ్యూసర్ దీప్తి నడిమింటి మాట్లాడుతూ,’సినిమా మీద ఉన్న ప్యాషన్ నన్ను ప్రొడ్యూసర్‌గా ఈ వేదిక మీదకు తీసుకొచ్చింది. నిర్మాతగా ఒక బాధ్యతతో ఈ సినిమా చేశాను. బలమైన కథ, క్యారెక్టర్స్‌తో ఈ సినిమాను నిర్మించాం. మా మూవీ ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది’ అని అన్నారు ‘డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి) అనే పాయింట్ చుట్టూ డ్రామా అల్లుకున్న కథతో ఈ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాం’ అని డైరెక్టర్ శుభ సాయి వెంకట్ చెప్పారు. హీరో కికు యనమల మాట్లాడుతూ,’మా మావీ కంటెంట్ చాలా బాగుంది. కొత్త వాళ్లైనా బాగా తెరకెక్కించారే, బాగా పర్‌ఫార్మ్ చేశారే అని ప్రేక్షకులు అనుకునేలా మా సినిమా ఉంటుంది’ అని తెలిపారు.
అరుదైన పాయింట్‌తో ‘చిరంజీవి’
- Advertisement -
- Advertisement -



