రఘుకుంచే టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా అనేది సినిమా ట్యాగ్‌లైన్. మోటూరి టాకీస్ పతాకంపై రఘు కుంచె సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు.
వాణి రవికుమార్ మోటూరి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ఈ నేపథ్యంలో యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె మీడియాతో ముచ్చటించారు.
నేను యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా గతంలోనూ కొన్ని చిత్రాలకు పనిచేశాను. కానీ ఈ సినిమా నాకు సమ్ థింగ్ స్పెషల్ అనిపించింది.
ఆద్యంతం సాగే క్యారెక్టర్‌లో నటించడంతో సినిమా మీద కమాండ్ ఏర్పడింది. అది మ్యూజిక్ చేసేప్పుడు చాలా ఉపయోగపడింది. మా మూవీలో బీజీఎం చాలా నేచురల్‌గా కుదిరింది. ఈ మధ్య సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ క్యారెక్టర్స్‌ను డామినేట్ చేస్తోంది.
అప్పట్లో ‘శివ, గీతాంజలి’ లాంటి మూవీస్ మనం గమనిస్తే పెరుగు మీద మీగడలా క్యారెక్టర్‌ను బీజీఎం మరింత అందంగా చేసేది. ఇప్పుడు బీజీఎం అంటే శబ్దంలా మారిపోయింది. క్యారెక్టర్‌ను ఎక్కడా బీజీఎం డామినేట్ చేయకుండా, సెటిల్డ్‌గా కంపోజ్ చేశాను. పాటలు కూడా కథను ముందుకు నడిపించేలా సిచ్యువేషనల్‌గా ఉంటాయి. మూడు సాంగ్స్‌లో ఒకటి నేను, మరొక పాట బేబక్క, ఇంకోటి మంగాదేవి పాడారు. ‘కేజీఎఫ్, కల్కి’ వంటి మూవీస్‌కు సౌండ్ డిజైన్ చేసిన రాజారత్నం దగ్గర పనిచేసిన హరీష్ మా చిత్రానికి సౌండ్ డిజైన్ చేశారు. డాల్బీలో చూస్తే మా మూవీ సౌండింగ్ బాగా ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో నా క్యారెక్టర్ భయపెట్టేలా ఉండాలి, అలా కనిపించేందుకు 12 కేజీల బరువు పెరిగాను. మైత్రీ శశి సినిమా చూసి మీరు అప్పట్లో చేసిన టెలివిజన్ కార్యక్రమాలు చూసి సాఫ్ట్‌గా ఉంటారనుకున్నా, ఈ క్యారెక్టర్‌లో భయపెట్టారు అన్నారు. సినిమా చూసిన వాళ్లంతా నా క్యారెక్టర్ మాస్ అప్పీల్‌తో బాగుందని చెప్పారు.
నైజాంలో మైత్రీ వాళ్లు 100కు పైగా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఏపీ తెలంగాణలో కలిపి 200 స్క్రీన్స్, అలాగే ఓవర్సీస్‌లో 60 లొకేషన్స్‌లో మా సినిమా రిలీజ్ అవుతోంది.
అందర్నీ మెప్పించే ‘గేదెల రాజు’
- Advertisement -
- Advertisement -



