Monday, April 20, 2026
E-PAPER
Homeసినిమాటీఎఫ్‌డీఏ కోసం రూ.30 కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు

టీఎఫ్‌డీఏ కోసం రూ.30 కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు

- Advertisement -

‘నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఉగాది రోజు మాతో ఓ గొప్ప ఆలోచనని పంచు కున్నారు. నిర్మాతలుంటేనే మా దర్శకులు మనుగడ కొనసాగించగలరు. టాలెంట్‌ ఉండి కూడా యూనియన్‌ మెంబర్‌ షిప్‌ కోసం కష్టపడాల్సి వస్తుంది. ఇటువంటి తరుణంలో చదలవాడ శ్రీనివాసరావు వారి బ్యానర్‌ పై ముప్పై కోట్లతో పది సినిమాల్ని నిర్మించాలని సంకల్పించారు. మా అసోసియేషన్‌లోని మెం బర్లకు ఆయన గొప్ప అవకాశం ఇస్తున్నారు. దీని ద్వారా పది మంది దర్శకుల కంటే.. వంద, నూట యాభై మంది అసిస్టెంట్‌ డైరెక్టర్లకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది’ అని టిఎఫ్‌డిఏ అధ్యక్షుడు వి.ఎన్‌.ఆదిత్య చెప్పారు.
ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (టిఎఫ్‌డిఏ) ఆధ్వర్యంలో రూ.30 కోట్ల బడ్జెట్‌తో పది సినిమాల్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని సోమవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చదలవాడ శ్రీనివాసరావు హజరవ్వగా, అసోసియేషన్‌ అధ్యక్షులు వి.ఎన్‌. ఆదిత్య, ట్రెజరర్‌ సాయి రాజేష్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ సముద్ర, దర్శకులు నవీన్‌ మేడారం, అజరు కుమార్‌, ప్రసన్న కుమార్‌ తదితరలు హాజరయ్యారు.
వి.ఎన్‌.ఆదిత్య మాట్లాడుతూ, ‘చదలవాడ శ్రీనివాసరావు నిర్మించబోయే ఈ సినిమాల కోసం మేం ఓ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీలో సీనియర్‌ దర్శకులు అజరు కుమార్‌, ప్రసన్న కుమార్‌ వంటి వారు కీలకంగా వ్యవహరిస్తారు. మా డైరెక్టర్‌ అసోసియేషన్‌లోని మెంబర్లు చెప్పిన కథలు, బౌండెడ్‌ స్క్రిప్టుల్ని ఫిల్టర్‌ చేస్తున్నాం. ఈ సినిమాల్లో లాభాలు వస్తే.. యూనియన్‌కే ఇస్తాను అని ఆయన అన్నారు. ఇది మాకు అవకాశం కాదు.. వరం.. ఆయనకు శతసహస్ర కతజ్ఞతాభివందనాలు’ అని తెలిపారు. ‘టీఎఫ్‌డీఏకి ట్రెజరర్‌గా ఉండటం గర్వంగా ఉంది. విద్య, వైద్యం, ఉపాధి అనే నినాదంతో మేం ఎన్నికల్లో గెలిచాం. ఉపాధి ఎలా కల్పించాలనే మథనం మా అందరిలో ఉండేది. దానికి చదలవాడ దేవుడి రూపంలో మాకు వరమిచ్చారు. ఆయన ఇచ్చిన అవకాశంతో ఎంతో మంది కొత్త టెక్నీషియన్స్‌, కొత్త టాలెంట్‌ను ఇండిస్టీకి పరిచయం చేస్తామని, లాభాల్ని కూడా తెచ్చి పెడతామని హామీ ఇస్తున్నాం’ అని సాయి రాజేష్‌ చెప్పారు.

ఏఎన్నార్‌, శోభన్‌ బాబు వంటి ఎంతో మందితో ఎన్నో సినిమాలు తీశాను.
నాకు ఇప్పుడున్న ఇండిస్టీ కన్నా అప్పుడున్న ఇండిస్టీ అంటేనే ఇష్టం. ఇప్పుడు సినిమా పరిశ్రమలో అన్నీ పెరిగాయి.. థియేటర్లు మాత్రం తగ్గుతున్నాయి. సత్తా ఉన్న నిర్మాతలు, దర్శకులకి కూడా తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను దర్శకులకు అండగా ఉండాలని నిర్ణయించు కున్నాను. మంచి విలువలు, మంచి కథలు, కమర్షియల్‌ అంశాలుండే గొప్ప సినిమాల్ని తీయాలని కోరుకుంటున్నాను. మంచి సినిమాలు తీసి.. వాటి ద్వారా హీరోలు, ఆర్టిస్టులు, దర్శకులు ఇండిస్టీలో నిలబడితే నాకు అదే చాలు.
– నిర్మాత
చదలవాడ శ్రీనివాసరావు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -