Monday, February 16, 2026
E-PAPER
Homeసినిమామరో ఫీల్‌గుడ్‌ సినిమా

మరో ఫీల్‌గుడ్‌ సినిమా

- Advertisement -

‘బలగం’ ఫేమ్‌ కావ్య కళ్యాణ్‌రామ్‌, ”కొత్తపోరడు’ ఫేమ్‌ అన్వేష్‌ మైఖేల్‌ జంటగా ‘వాట్స్‌ అప్‌ నరేష్‌’ అనే చిత్రం రాబోతోంది. సివివి సినిమా బ్యానర్‌ మీద భాగ్యలక్ష్మీ చింత నిర్మించిన ఈ చిత్రానికి సివి విశాల్‌ దర్శకత్వం వహించారు. యూత్‌ ఫుల్‌, లవ్‌ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ను ఇటీవలే రిలీజ్‌ చేసి, ఒక్కసారిగా అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు. ఇక ఇప్పుడు వాలెంటైన్స్‌ డే సందర్భంగా రెండో గ్లింప్స్‌ని రిలీజ్‌ చేశారు. ‘ఎట్ల నడుస్తుంది డేటింగ్‌ లైఫ్‌’ అని హీరో అడగడం.. ‘మొన్ననే చెప్పిన కదా నాకు ఇష్టం లేదని’.. అని హీరోయిన్‌ సంభాషణతో గ్లింప్స్‌ను ఓపెన్‌ చేశారు.

‘నువ్వెప్పుడూ డేట్స్‌కి వెళ్లడం లేదా?’.. అని హీరోయిన్‌.. ‘వెళ్లినా సెట్‌ అవ్వడం లేదు’ అని హీరో..’ ఏ.. ఏ..’ అని హీరోయిన్‌ అడగడంతో వారి సంభాషణ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక చివరకు ‘మీ ఇంట్లో కాస్ట్‌ పిచ్చి ఏమైనా ఉందా?’.. అంటూ కులం గురించి మాట్లాడుకున్న సంభాషణ ఎంతో ఫన్నీగా ఉంది. అలా మొత్తానికి ఈ రెండో గ్లింప్స్‌తో ఇదొక ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌ అని చెప్పకనే చెప్పేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన ‘అయోమయంగా సాగుతున్న పయనమే ఇదా’ అనే పాట ఎంతో హాయిగా, వినసొంపుగా ఉంది. ఈ చిత్రానికి స్మరణ్‌ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. విప్లవ్‌ నైషదం ఎడిటర్‌గా పని చేస్తున్నారు. వేదరామన్‌ శంకరన్‌ కెమెరామెన్‌గా వర్క్‌ చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్‌లతో చిత్రయూనిట్‌ ఆకట్టుకోనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -