Monday, February 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'సూడు సూడు సిత్తరాలు..'

‘సూడు సూడు సిత్తరాలు..’

- Advertisement -

న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేస్తూ హీరో కిరణ్‌ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌ పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. తేజ వేల్పుచర్ల సహ నిర్మాత. సాయి తేజ్‌, వేద జలంధర్‌ హీరో, హీరోయిన్స్‌గా, వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే పీరియాడిక్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మహాశివ రాత్రి పర్వదినం సందర్భంగా ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ ‘టీవీ వీడియో సాంగ్‌’ రిలీజ్‌ చేశారు. టీవీ, డిష్‌ వచ్చిన కొత్తలో పల్లెటూరి ప్రజలు ఎంత ఆసక్తిగా ఆ ప్రసారాలు చూశారో ఈ పాటలో చిత్రీకరించారు.

టీవీ ఇంటికి వచ్చిన రోజు ఆ ఇంటివారికే కాదు ఆ ఊరిలో టీవీ లేని వారందరికీ పండుగ రోజే. ఊరిలో మొదట టీవీ కొనడం మామూలు గొప్ప కాదు, టీవీ ఉన్న ఇంటికి వెళ్లి మిగతా వారంతా సీరియల్స్‌, సినిమాలు చూసేవారు. ఈ సందడిని పాటలో తెలియజేస్తూ సనరే సాహిత్యాన్ని అందించారు. వంశీకాంత్‌ రేఖన సంగీతాన్ని అందించగా, స్వరాజ్‌ కీర్తన్‌ పాడారు. ‘సూడు సూడు సిత్తరాలు, నట్టింట్లోకొచ్చె సినిమా హాలు, సూడు సూడు సీరియళ్లు, మరి చాలవంట రెండు కళ్లూ, ఎవడంటా మొట్టమొదట టీవీ తెచ్చింది, ఊరంతా మోతమోగాలా, తెరమీద చిందులకు మతిపోయిందంటూ, పడనోళ్ల గుండె పగిలి గుక్కె పట్టి ఏడ్చేయాల….’ అంటూ సాగే ఈ పాట ఇన్‌స్టంట్‌గా విశేష శ్రోతకాదరణ పొందుతోందని మేకర్స్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -