నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన పలువురు వార్డు సభ్యులు కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సతీష్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐగా సతీష్ బాధ్యతలు స్వీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయనను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తనను మర్యాదపూర్వకంగా కలిసిన వార్డు సభ్యులతో ఆయన ముచ్చటించారు.గ్రామాల్లో జరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు ప్రమాదలు, ఇతర సంఘటనల గురించి వార్డు సభ్యులను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యుల సహకారం ఎల్లప్పుడూ అవసరమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొమ్ముల సంతోష్, దాసరి రాకేష్, బైరగోని అజయ్, విబుది అనిల్, నాయకులు అజారోద్దీన్, మొహమ్మద్ సాదిక్, నడుకుడ క్రాంతి, తదితరులు పాల్గొన్నారు..
నూతన ఎస్ఐ సతీష్ ను కలిసిన వార్డు సభ్యులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



