కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్న ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షురాలు కి కృతజ్ఞతలు
కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు ఆకుతోట సతీష్
నవతెలంగాణ- నెల్లికుదురు
మెజారిటీ కౌన్సిలర్ల మద్దతుతో నూతనంగా ఎన్నుకోబడిన మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపినట్లు గా డిసిసి ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు ఆకుతోట సతీష్ తెలిపారు. సోమవారం నూతనంగా గెలిచిన చైర్మన్ జ్యోతి రమేష్ కి శాలువాతో ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబాద్ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్, మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ చేసిన అభివృద్ధి పట్టిన పట్టుదలతో ముందుకు వెళ్ళినందున ఈ విజయం సాధించాలని అన్నారు.
నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే కుటుంబానికి రుణపడి ఉంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే కు మరియు జిల్లా అధ్యక్షురాలికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మద్ది రాజేష్ , నల్లగుట్ట తండ సర్పంచ్ హేమావతి శ్రీనివాస్ , జామ తండ సర్పంచ్ సోమన్న, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ రావుల సతీష్ , రాత్తిరాం తండ ఉప సర్పంచ్ సంతోష్ , తదితరులు పాల్గొన్నారు.



