Monday, February 16, 2026
E-PAPER
Homeజిల్లాలుకొలువుదీరిన నూతన మున్సిపల్ పాలకవర్గం

కొలువుదీరిన నూతన మున్సిపల్ పాలకవర్గం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
పట్టణ మున్సిపల్ కార్యాలయం నందు సోమవారం నూతన పాలకవర్గం కొలువు తీరింది. మున్సిపల్ చైర్ పర్సన్ గా 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుండి నుండి గెలుపొందిన  గోనె లహరి రఘు, వైస్ చైర్మన్ గా 11వ వార్డు  కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన కాట్పల్లి వెంకట్ రెడ్డి  లను ఎన్నుకున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుండి స్థానిక సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా , ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు  స్థానిక ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి ,స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ ల ఆధ్వర్యంలో  మున్సిపల్ కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాట్లను పకడ్బందీ చేసినారు. ముందుగా స్థానిక మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి గెలుపొందిన అభ్యర్థులతో రాగా, కాంగ్రెస్ నాయకులు ఏ బి చిన్న, వినయ్ రెడ్డి  లు  కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చినారు.

ఆ తర్వాత బిజెపి అభ్యర్థులు  రాగా తెలుగు  అక్షరమాలలో కౌన్సిలర్లచే సబ్ కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత గోనే లహరి ను చైర్పర్సన్ గా 35వ వార్డు కౌన్సిలర్ సడక్ వినోద్, 14వ వార్డు కౌన్సిలర్ షేక్ నహీం లు బలపరిచినారు . మొత్తం చైర్మన్కు 24 రూ కౌన్సిలర్లు ఆమోదంతో చైర్ ర్సన్ గా ప్రకటించిన రు. వైస్ చైర్మన్ కు నాలుగవ వార్డు కౌన్సిలర్ సర్కెల్లి సృజన్, ఆరవ వార్డు కౌన్సిలర్  షేర్ల మమత ఇద్దరూ బలపరచగా మొత్తం 22 మంది కౌన్సిలర్లు ఆమోదం తెలుపగా వైస్ చైర్మన్ గా ప్రకటించినారు. గెలుపొందిన చైర్ పర్సన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి టపాసులు కాల్చుతూ ర్యాలీ నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన నియమాకానికి కృషిచేసిన ముఖ్యమంత్రి కి ,పిసిసి చీఫ్ కు,  సుదర్శన్ రెడ్డి కి, వినయ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పట్టణ అభివృద్ధి లో నిర్విరామ కృషి చేస్తానని తెలిపారు. కాగా వైస్ చైర్మన్ ఎంపికలో పలువురు ఆశావాహులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -