పట్టణాలు కూడా కాంగ్రెస్ వైపు
సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ కు పెరిగిన ఓటింగ్ : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
నవతెలంగాణ – ఆలేరు రూరల్
యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా తాను మొదటిసారిగా ఉన్నప్పుడు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ కి పట్టం కట్టడం ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజలు కానుకగా పంపించడం గర్వంగా ఉందన్నారు.
ఆలేరు మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రమిచ్చిన సోనియా గాంధీకి ఋణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ కంటోన్మెంట్ ఎమ్మెల్సీ జూబ్లీహిల్స్ సర్పంచ్ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూ ప్రభుత్వ సాగిస్తున్న ప్రజా పాలనపై పూర్తి విశ్వాసంతో ప్రజలు పల్లెలు పట్టణాలు తేడా లేకుండా కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి పెరిగిన ఓటింగ్
ఆలేరు గుట్టలో పోలైన ఓట్లలో 57% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయడం రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతుందన్నారు.యాదగిరిగుట్టలో ఒక్క బీఆర్ఎస్ కౌన్సిలర్ గెలిచి సోమవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే ఓటు వేయడం అభివృద్ధి కోసం కాంగ్రెస్ వైపే ఉంటానని బిఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించినట్లు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలది
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైనది అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం చేసిన చైర్ పర్సన్ చైర్మన్ వైస్ చైర్మన్ లకు అభినందనలు తెలిపారు.ఆలేరు యాదగిరిగుట్టలో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను అభినందించారు.
రాజకీయాలకు పక్కకు పెట్టి అభివృద్ధి చేద్దాం
ఎన్నికల వరకే రాజకీయాలు చర్చించాలని ఎన్నికల తర్వాత అన్ని పక్షాలను సమన్వయపరచుకుంటూ అభివృద్ధి పథంలోకి ఆలేరు ముందుంచేందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు.వీరితోపాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి టి పి సి పి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మా వెంకటస్వామి ఆలేరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ బిజన బాలమణి భాస్కర్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు కౌన్సిలర్లు జూకంటి సంపత్ మల్లెల సరిత శ్రీకాంత్ జెట్ట సిద్ధులు మరియమ్మ మార్క్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ్రాజు వెంకటేశ్వర రాజు కట్టెగోమ్ముల సాగర్ రెడ్డి ఎమ్మెస్ విజయకుమార్ ఎండి సలీం ముదిగొండ శ్రీకాంత్ ఎండి జైనుద్దీన్ దూడల రాజు తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ముందుగా భువనగిరి టోల్ గేట్ నుండి యాదగిరిగుట్ట మీదుగా ఆలేరుకు భారీ కాన్వాయ్ తో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు.



