Tuesday, June 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమికోన్నత పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

ప్రాథమికోన్నత పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

- Advertisement -

 నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోనిహాస కొత్తూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నూతన విద్యార్థులకు బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు గ్రామ సర్పంచ్ నలిమేల రేవతి గంగాధర్, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి విద్యా అవకాశాల కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలోనే చేర్పించాలన్నారు.

విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను, సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని వారు అభిప్రాయపడ్డారు. నూతనంగా చేరిన విద్యార్థులతో పాటు చిన్న పిల్లలందరికీ పాఠశాల ఆవరణలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మనోహర్ రెడ్డి, వార్డ్ సభ్యులు కుందేటి శ్రీనివాస్,  గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు లింబాద్రి, గ్రామ విద్యాశాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యాయులు అంజాద్ సుల్తాన్, పసుపుల ప్రసాద్, సరిత, చిన్నారుల తల్లిదండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -