నవతెలంగాణ – హైదరాబాద్; టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా న్యూజిలాండ్, కెనడా జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన కెనడా బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. కెనడా ఓపెనర్ యువరాజ్ సమ్రా బ్యాట్‌తో శతకం రాణించాడు. యువరాజ్ 110 పరుగుల వద్ద (65 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) సేజాకబ్ డఫీ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌నకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా 36 పరుగులతో రాణించాడు. అతడు యువరాజ్‌తో కలిసి తొలి వికెట్‌కు 84 బంతుల్లో 116 పరుగులు జత చేశాడు. నవ్‌నీత్ ధలీవాల్ (10), నికోలస్ కిర్టన్ (2) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. హర్ష్ థాకర్ (3*), డిల్లాన్ హేలిగర్ (8*) నాటౌట్‌గా నిలిచారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, కేల్ జెమీసన్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ తీసుకున్నారు.
యువరాజ్ సమ్రా సూపర్ శతకం..న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



