Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయం వద్ద  తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి  కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ ఆధ్వర్యంలో కేసిఆర్ జన్మదిన వేడుకలను పండుగల నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.  

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ తరపున కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అవమానాల నుంచి అసమాన విజయాల వరకు సాగిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

పదవులను త్యజించి, ప్రాణాలను పణంగా పెట్టి  సాగించిన అద్భుత పోరాటం తెలంగాణ ప్రజలు ఎన్నటికి మర్చిపోరన్నారు. దూషించిన నోర్లు, ఇప్పుడు కేసిఆర్  గొప్పతనం తెలుసుకుని వేనోళ్ల పొగుడుతున్నాయన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలావత్ ప్రకాష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ సామా బాపురెడ్డి, కోన సముందర్ సర్పంచ్ బెజ్జరపు రాకేష్, కమ్మర్ పల్లి ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్, టిఆర్ఎస్ రైతు విభాగం మండల అధ్యక్షులు బద్దం రాజశేఖర్,బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొంటికంటి నరేందర్, మాజీ ఎంపిటిసి సభ్యుడు మైలారం సుధాకర్, పార్టీ మండల ఉపాధ్యక్షులుమల్యాల సుభాష్ గౌడ్, కొత్తపల్లి రఘు, రేంజర్ల మహేందర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -