Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పనిప్రదేశాల్లో కూలీలకు సౌకర్యాలు కల్పించాలి

పనిప్రదేశాల్లో కూలీలకు సౌకర్యాలు కల్పించాలి

- Advertisement -

సర్పంచ్ శ్యామల శేఖర్
నవతెలంగాణ – కట్టంగూర్
పని ప్రదేశాల్లో కూలీలకు మౌళిక సౌకర్యాలు కల్పించాలని స్థానిక సర్పంచ్ శ్యామల శేఖర్ ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. మంగళవారం కట్టంగూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మీరాసాహెబ్ గూడెం లో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ఆమె పరిశీలించి కూలీలతో మాట్లాడారు. కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాలని, కూలీలు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -