Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల్య వివాహాలు, బ్రూణ హత్యలు జరుగుకుండా చూడాలి

బాల్య వివాహాలు, బ్రూణ హత్యలు జరుగుకుండా చూడాలి

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
బాల్య వివాహాలు, బ్రూన హత్యలు జరుగుకుండాఅన్నీ డిపార్టు మెంట్ అధికారులు బాధ్యత గా వ్యవహారించాలని అనుముల ఐసీడీఎస్ శిశు సంక్షేమ అధికారి విజయలక్ష్మి అన్నారు. మంగళవారం బేటీ బచావో,బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం లోని అన్నీ డిపార్టు మెంటు అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించి బాల్య వివాహాలు,పిల్లల రక్షణ,బాధ్యత,సైబర్ నేరాలు,బాలికల పై డిజిటల్ హింస వంటి వాటిపై అధికారులతో చర్చించారు.

ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ .. బాల్య వివాహాలు జరిపితే, అమ్మాయిని తీసుకువెళ్లి, బాల సదనం లో ఉంచి, 18 ఏళ్లు నిండిన తర్వాతనే తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందన్నారు. చిన్న వయసులో బాల్య వివాహాలు చేయడము వల్ల బాలికల బంగారు భవిష్యత్తుకు ఆటంకం ఏర్పడుతుందన్నారు.గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడము చాలా చట్ట విరుద్ధమని, సమాజంలో ఆడ మగ అనే భేదం లేకుండా సూసే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. 2006 ప్రకారం 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు 21 సంవత్సరాల లోపు మగ పిల్లలకు వివాహాలు చేయటం చట్టరీత్యా నేరమని తెలిపారు.

మీ ప్రాంతంలో గాని, గ్రామంలో గాని బాల్య వివాహం జరిపించడానికి ప్రయత్నం చేస్తున్న,పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్లు మీకు తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1098 మరియు 100 కు సమాచారం అందజేసేలా గ్రామాల్లో ప్రజలకు అంగన్వాడీ సూపర్ వైజర్లు అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ ఉమాదేవి,ఎంఈఓ తరి రాము,వైద్య సిబ్బంది జయ కుమారి,రజని,రెవిన్యూ సిబ్బంది శ్రీను,జనార్ధన్,పోలీస్ సిబ్బంది ఇద్దయ్య,ఏసీడీపీఓ సువర్ణ,ఐసీడీఎస్ సూపర్ వైజర్లు వెంకాయమ్మ,శశికళ,గౌసియా బేగం తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -