Tuesday, February 17, 2026
E-PAPER
Homeకరీంనగర్రాయికల్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

రాయికల్ లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి,స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల,పట్టణ పార్టీ అధ్యక్షులు బర్కం మల్లేష్,ఎలగేటి అనిల్ కుమార్,మున్సిపల్ చైర్మన్ కట్కం రవిందర్,పార్టీ మండల కో-ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శులు రత్నాకర్ రావు, మహేష్ గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -