నవతెలంగాణ – పెద్దవూర
పెద్దవూర మండలం పోతునూరు స్టేజీకి అతి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న కోళ్లఫారం నిర్మాణ పనులను రద్దు చేయాలని మంగళవారం పోతునూరు సర్పంచి పెండ్యాల సంతోష్ రావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు మండల అభివృద్ధి అధికారి ఉమాదేవికి,తహసీల్దార్ శ్రీదేవి కి వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా సర్పంచి,గ్రామస్తులు గ్రామ పంచాయతీ పరిధి లో సర్వే నంబర్ 282 లో సుమారు 12 ఎకరాల వ్యవసాయ భూమి లో హైద్రాబా నివాసి అయిన గడ్డం వెంకట్ రెడ్డి, అనే వ్యాపారవేత్త మా ఊరి లో కోళ్ల షెడ్డు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు.
పోతునూరు లో 150 కుటుంబాలు నివాసంఉంటునన్నామని,కోళ్ల షెడ్డు నిర్మాణం గ్రామానికి దగ్గరగ నిర్మాణం చేయడం వల్ల కోళ్ల పెంట వల్ల వచ్చే దుర్వాసనతో ప్రజలకు రోగాలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు.అంతే గాక కోళ్లకు వచ్చే వ్యాధులు మనుషులకు సోకే ప్రమాదంకూడా వుంది కావున ఇట్టి కోళ్ల షెడ్డు నిర్మాణం నిలిపివేయాలని,ఎలాంటి నిర్మాణంలు జరగకుండా మా సమస్యకు పరిష్కార మార్గం చేపట్టాలని మా గ్రామ ప్రజలు కోరుకుంటున్నామని మండల అభివృద్ధి అధికారి మానే ఉమాదేవి,తహసీల్దార్ శ్రీదేవి కి విన్న వించారు.
వినతిపత్రం ఇచ్చిన వారిలో చింతల ఆంజనేయులు, రెడ్డి నరసింహ, తెలపాటి నాగరాజు,మద్దూరు శీను, తరి నరేష్, రేపాకుల సాయి కుమార్,మద్దూరు సతీష్, రొయ్య శీను, తుమ్మ శేఖర్, తుమ్మ శ్రీను, రాఘవులు,మద్దూరీ వెంకటేశ్వర్లు,నవీన్,తగరం వినోద్,మద్దూరీ కొండలు,నాగార్జున,పురం వంశీ తదితరులు ఉన్నారు



