Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు వరి కొనుగోలు డబ్బులు 100% చెల్లింపు

రైతులకు వరి కొనుగోలు డబ్బులు 100% చెల్లింపు

- Advertisement -

జిల్లా సివిల్ సప్లై అధికారి నరసింహ రాజ్ 
నవతెలంగాణ – అచ్చంపేట
2025- 2026 వానాకాలం కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు చేసిన రైతులందరికీ కనీసం మద్దతు ధర ప్రకారం పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించినట్లు జిల్లా సివిల్ సప్లై అధికారి నర్సింహారాజ్ మంగళవారం నవతెలంగాణతో తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని 20 మండలాల పరిధిలో 22,328 మంది రైతుల నుంచి 1,14,443 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వీటికి సంబంధించిన రూ. 273 కోట్ల 40 లక్షలు కనీసం మద్దతు ధర ప్రకారం కొనుగోలుకు సంబంధించిన డబ్బులు 100% రైతులకు చెల్లించడం జరిగిందన్నారు. అదేవిధంగా వరి పంట సాగు చేసిన రైతులకు క్వింటాళ్లుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సంబంధించిన బోనస్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేసింది 17471 మంది రైతులకు రూ.45 కోట్ల 31 లక్షలు ఇప్పటివరకు రైతుల ఖాతాలో జమ అయినట్లు అధికారి వెల్లడించారు. మిగతా రైతులకు రోజువారిగా వారి వారి ఖాతాలో జమ కావడం జరుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -